#367Telugu Spiritual Song
Devuni sthutinchai randi- Gatha samvatsaramuna kaapaden
దేవుని స్తుతించ రండి - గత సంవత్సరమున కాపాడెన్
ప|| దేవుని స్తుతించ రండి - గత సంవత్సరమున కాపాడెన్
అ.ప. కీడు మనలను చేరకను - కోటి కీడుల నుండి కాపాడినట్టి - మహా
1. కోట్లకొలది మరణించిరి - మన మిచ్చట చేరియున్నాము
కష్టముల బాపి మనల నింక - జగమున జీవితులుగ నుంచినట్టి - మహా
2. ఎన్ని కీడుల మనము చేసిన నన్ని - మేళ్లను చేసెనుగా
నిరతము కాచి చక్కగను - ప్రభు ప్రేమతో కాచినందున స్తుతిచేసి
3. ఏకముగా పాడి హర్షముతో - లెక్కలేని మేలులకై
ఆత్మదేహములను బలిగ - నిపుడేసు కర్పించెద మేకముగా - చేరి
4. వత్సరారంభమున నిను - మే మొక్కటిగా నారాధింప
దైవకుమారా కృపనిమ్ము - మా జీవిత కాలమంతయు పాడి - మహా
5. భూమియందలి మాయల నుండి - సైతానుని వలలో నుండి
ఆత్మతో నిన్ను సేవింప నిపుడేలుమనుచు - బ్రతిమాలెదము - కూడి
6. ప్రతి సంవత్సరమును మముజూడుము - దుర్గములో మము చేర్చుమయ్యా
దాటునపుడు నీ సన్నిధిని చూపి - ధైర్యమునిచ్చి ఓదార్పుమయ్యా - మహా
7. స్తోత్రింతుము ప్రభువా నీ పదముల - సకలాశీర్వాదముల నిమ్ము
ప్రేమతో ప్రభుతో నుండ - నెట్టి యాపద లేక బ్రోవుమామెన్ - ప్రభు
