#369Telugu Spiritual Song
Mangalame yesunaku - manujaa vathaarunaku
మంగళమే యేసునకు - మనుజావతారునకు
ప|| మంగళమే యేసునకు - మనుజావతారునకు
శృంగార ప్రభువునకు - క్షేమాధిపతికి మంగళమే
1. పరమ పవిత్రునకు - వరదివ్యతేజునకు
నిరుపమానందునకు - నిపుణ వేద్యునకు || మంగళ ||
2. దురిత సంహారునకు - వరసుగుణోదారునకు
కరుణా సంపన్నునకు - జ్ఞానదీప్తునకు || మంగళ ||
3. సత్య ప్రవర్తునకు - సద్ధర్మశీలునకు
నిత్యాస్వయంజీవునకు - నిర్మలాత్మునకు || మంగళ ||
4. యుక్తస్తోత్రార్హునకు - భక్త రకక్షామణికి
సత్యపరంజ్యోతియగు - సార్వబౌమునకు || మంగళ ||
5. పరమపురి వాసునకు - నరదైవ రూపునకు
పరమేశ్వర తనయునకు - బ్రణుతింతుము నీకు || మంగళ ||
