18px
#370Telugu Spiritual Song

Prabhu yesu naakai nee sarvamu nichitivi

ప్రభుయేసు నాకై నీ సర్వము నిచ్చితివి - ప్రేమనుబట్టి అర్పించుకొంటివి నాకై

ప|| ప్రభుయేసు నాకై నీ సర్వము నిచ్చితివి - ప్రేమనుబట్టి అర్పించుకొంటివి నాకై
1. శిరస్సు నిచ్చితివి ముండ్ల మకుటముకై - స్వామి నా పాపముల కొరకే సహింపజాలని వేదన బహుగా - సహిచితివి ప్రేమతోడ || ప్రభు ||
2. కన్నుల నిచ్చితివి కన్నీరు కార్చ - కరుణించి నా స్థితిని జూచి కరిగె నీ హృదయం దుఃఖంబుతోడ - కడు వేదనతో యేడ్చితివి || ప్రభు ||
3. కొరడా దెబ్బలచే నీ దేహమంత - చారలుగ దున్నబడెను శరీరమంత రక్తమయమాయె - వరదా! గాయము లొందితివా || ప్రభు ||
4. కాళ్లు చేతులలో మేకులు గొట్టిరి - బల్లెముతో ప్రక్కన్ బొడిచిరి యేలాగు వివరింతు నీ బాధ నేను - ఓర్చితివా మౌనము వహించి || ప్రభు ||
5. ప్రాయశ్చిత్తంబై పోతివా నాకై - పాపము నుండి విడిపించుటకు పొందితి నెంతో గొప్ప రక్షణను - పశ్చాత్తాపము ద్వారా నేను || ప్రభు ||
6. ఎంత అద్భుతము ప్రభువా నీ ప్రేమ - ఎందుకింతగా ప్రేమించితివి వందన మర్పింతు నీ పాదములకే - పొందుగ నీ వాడనైతి || ప్రభు ||
7. నా యెడల నీదు సంకల్పమేగా - నీ స్వాస్థ్య మనుభవించుటకు నీ తోడ నిరతం నేనుండునట్లు - నీ యధికారం బిచ్చితివి || ప్రభు ||