18px
#488Telugu Spiritual Song

Vintimayya nee swaramu - kantimayya nee roopamunu

వింటిమయ్యా నీ స్వరము - కంటిమయ్యా నీ రూపమును

ప|| వింటిమయ్యా నీ స్వరము - కంటిమయ్యా నీ రూపమును ప్రియప్రభూ నిన్ను గాక - వేరెవరిని చూడము వినము
1. భక్తి మర్మము గొప్పది యెంతో - శరీరుడుగా మారిన దేవా, దూతలకు కనబడితివి లోకమందు - నమ్మబడియున్న దేవా || వింటి ||
2. భయపడవలదని దూతలు తెల్పె - మహా సంతోషకరమైన వార్త రక్షకుడు పుట్టెనని పరమందు - మహిమ భువికి శాంతియనిరి || వింటి ||
3. నరరూప ధారివి యైతివి ప్రభువా - అద్భుతములు చేసియున్నావు వేరెవ్వరు చేయలేరు - అద్భుతకరుడు ఘనత కలుగునుగాక || వింటి ||
4. మూగవారికి మాటలిచ్చితివి - గ్రుడ్డికుంటిని బాగుజేసితివి మృతులను లేపితివి పరాక్రమశాలివి - నీవే ఓ ప్రభువా || వింటి ||
5. ప్రేమించి ప్రభువా ప్రాణమిచ్చితివి - అధికారముతో తిరిగి లేచితివి, మరణపు ముల్లు విరచితివి సమాధి - నిన్ను గెలువకపోయెను || వింటి ||
6. ఇహము నుండి పరమున కేగి - మా కొరకై నీవు రానైయున్నావు ఆనందముతో కనిపెట్టెదము - మదియందే నిరీక్షణ కలిగి స్తుతింతుమేమ్ || వింటి ||