#489Telugu Spiritual Song
Kristuni swaramu vindunu prabhuve
క్రీస్తుని స్వరము విందును ప్రభువే పలికినపుడు
ప|| క్రీస్తుని స్వరము విందును ప్రభువే పలికినపుడు
మధుర స్వరమేయది మెల్లని స్వరమే యది
1. యెహోవా నీ స్వరము జలములపై వినబడెను
మహిమగల దేవుడు ఉరుమువలె గర్జించెను || క్రీస్తు ||
2. బలమైన నీ స్వరము బహు ప్రభావము గలది
దేవదారుల విరచును ప్రజ్వలింప చేయునగ్నిని || క్రీస్తు ||
3. అద్భుత ప్రభుస్వరము ఆరణ్యము కదిలించును
ఆకుల రాలజేయును లేళ్ల నీనజేయును || క్రీస్తు ||
4. ఆలయమందన్నియు ఆయననే ఘనపరచున్
ఆశీర్వాదము శాంతినొసగు నాయన స్వరమే || క్రీస్తు ||
5. నీ మధుర స్వరము నీ వాక్యమున విందున్
ప్రార్థనల యందున ప్రతిదినము పల్కెదవు || క్రీస్తు ||
6. నీ మధురస్వరము నీ చిత్తము తెల్పును
అనుదిన జీవితములో అనుసరించెద నిన్ను || క్రీస్తు ||
7. నీ మధుర స్వరము నీ మార్గము జూపును
కుడియెడమల తిరిగిన నీ స్వరమే వినబడును || క్రీస్తు ||
8. తుఫానులు కలిగి భయభీతులలో నుండ
భయపడకు మని పలికె ప్రేమగల నీ స్వరము || క్రీస్తు ||
9. మరణాంధకార లోయలో నేనుండ
నీకు తోడైయుంటి ననెడి స్వరమును వింటిన్ || క్రీస్తు ||
10. ప్రభువా సెలవిమ్ము నీదాసు డాలించున్
దీనుడనై నీ మాట అంగీకరిచెదను || క్రీస్తు ||
