18px
#641Telugu Spiritual Song

Yesu marala vachchunu

యేసు మరల వచ్చును - యేసు మరల వచ్చును

ప|| యేసు మరల వచ్చును - యేసు మరల వచ్చును తన వారిని పరమునకు తనతో కొనిపోవ యేసు త్వరగా వచ్చును
1. చెప్పెను యేసు తన శిష్యులతోను - నిశ్చయముగ వత్తునని ఎవరేసునితో నడుతురో ఇలలో ప్రత్యేకమవుదురో ఎవరెదురు చూతురో నమ్మి జీవింతురో వారిని కొనిపోవచ్చును
2. నా కొరకై స్థలమును సిద్ధపరచి - నిశ్చయముగా తిరిగి వచ్చును మనమాయన సహవాసములో - శ్రీయేసుని సంధింతుము ఏక మనస్సుతో ఆత్మబలముతో - కలసి సేవచేతుము
3. వాగ్ధానములనెల్ల నెరవేర్చుటకై - నిశ్చయముగ మరల వచ్చును ప్రియ యేసు ఆరాద్భుటముతో - ప్రభావముతో వచ్చును చూతుము మన ప్రభుని ఆనందించెదము - ప్రభుని పొందెదము
4. మేఘముపై రయమున - మన ప్రభుయేసు నిశ్చయముగా త్వరగా వచ్చును మహిమలో రానైయున్న నా ప్రియ ప్రభు యేసుని మనము చూచెదము మార్పుచెందెదము - ఆయనతో నిరతముందుము