#640Telugu Spiritual Song
Yesuni nityamu stutiyinchedamu
యేసుని నిత్యము స్తుతియించెదము - భూమి ఆకాశము సృజియించినాడు
1. యేసుని నిత్యము స్తుతియించెదము - భూమి ఆకాశము సృజియించినాడు
మనలో దేవుని సంకల్పము - యేసుని బయలుపరచుటయే
ప|| యేసుమారడు - యేసు మారడు - విశ్వమంతమారినను మాటతప్పడు
2. ఎందరిని ప్రభుముందు ఎరిగెనో - అందరిని ప్రభు నిర్ణయించెను
పొందుగ పిలిచి నీతిగాతీర్చె - సుందరముగా మహిమపర్చు || యేసు మారడు ||
3. చేసెను మనలను తన రూపమును - బాసెను పాపముచే నా రూపం
యేసులో నొసగె మరల మనకు - వాసిగ కాచును పుత్రులుగా || యేసు మారడు ||
4. దేవుని ప్రేమించువారందరికి - భువిలో జరుగునవన్ని మేలుకై
కావవి ఎన్నదగిన శ్రమలు - భావి మహిమతో పోల్చుటకై || యేసు మారడు ||
5. శ్రమయు బాధ హింసయైనను - కరువు వస్ర్తహీనతయును
ఉపద్రవమైనను ఖడ్గమైనను - ఎడబాపునే ప్రభు ప్రేమనుండి || యేసు మారడు ||
6. మరణము జీవమైనను - దేవదూతలు ప్రధానులు
అధికారులు మరి ఎవరైనను - ఎడబాపరు ప్రభు ప్రేమనుండి || యేసు మారడు ||
7. అనాది దేవుని ఆ సంకల్పం - మనలో ప్రభుని బయలుపరప
మానవలెను - మన పాపములు - పూనికతో పూర్ణఐక్యతకు || యేసు మారడు ||
