18px
#684Telugu Spiritual Song

Bhayapadakumu O chinna mandaa

భయపడకుము ఓ చిన్నమందా - దయగల మీ తండ్రి పిలుచుచున్నాడు

ప|| భయపడకుము ఓ చిన్నమందా - దయగల మీ తండ్రి పిలుచుచున్నాడు
1. తన రాజ్యమంత నీకీయగోరి - ఉన్నత పిలుపు నీకు నిచ్చెను తన రక్తమిచ్చి నిన్ను కొన్నాడు
2. దేవుని రాజ్య మహిమను బొంద - సువార్త ద్వారా నిన్ను పిలిచెను నీవు నడువుము తగినట్లు ప్రభుకు
3. పరిశుద్ధులలో పాత్రుని చేయ - పరలోక పిలుపు నీకు నిచ్చెను ప్రభుని స్వాస్థ్యమును నీకిచ్చున్
4. అక్షయ నిర్మల వాడబారని - రక్షణ స్వాస్థ్యము భద్రపరచి నిశ్చయముగా నిన్ను పిలిచెను
5. తన కుమారుని నీ కొరకీయ - వెనుదీయ లేదు నీ ప్రియ తండ్రి తన స్వాస్థ్యమంత నీ కొరకిచ్చున్
6. పరిశుద్ధాత్మలో నిను శుద్ధిజేసి - పరిశుద్ధుల స్వాస్థ్యము నీకీయ తెరువజేసెను నీ కన్నులను
7. సిలువలో యేసు చనిపోయి బ్రతికె - గెలిచె సమాధి బలమీయ నీకు హల్లెలూయని పాడుము నీవు