18px
#683Telugu Spiritual Song

Raajaadhiraaju devaadi devudu - tvaralo vachchuchundenu

రాజాది రాజు దేవాది దేవుడు - త్వరలో వచ్చుచుండెను

ప|| రాజాది రాజు దేవాది దేవుడు - త్వరలో వచ్చుచుండెను
అ.ప. మన యేసురాజు వచ్చును - పరిశుద్ధులన్ చేరు మనము ఆహా.. మనమచ్చటి కేగుదమేమ్(3)
1. ముద్రపొందిన శుద్ధులందరు - తెల్లంగి ధరించెదరు జయజెండాలు పట్టుకొందురు - విమోచన గీతం పాడెదరు ఆహా... ఎంతో ఆనందమది(3)
2. నిషిద్ధమైనది లోనికి వెళ్లదు - పరలోక పాలనది దుఃఖవ్యాధులచ్చటలేవు - ఆకలి దప్పికలచ్చట లేవు ఒకే హల్లెలూయ పాటయే(3)
3. అందరు కలిసి విందులో చేరి - ఆనందముగా నుందురు మధ్యకాశములో విందు - విమర్శింపబడెదరు-పరిశుద్ధులు పాల్గొందురు(3)
4. పరిశుద్ధులు పరిశుద్ధమగుటకు - సమయంబు ఇదియేను నీతిమంతుడు నీతిచేయును - ఫలములతోనే వచ్చెదరు - ఆమేన్ యేసుప్రభు రావయ్యా(3)