#345Telugu Spiritual Song
Athyunnatha Simhaasanamu pai - Aaseenuda vaina devaa
అత్యున్నత సింహాసనముపై - ఆసీనుడవైన దేవా
ప|| అత్యున్నత సింహాసనముపై - ఆసీనుడవైన దేవా
అత్యంత ప్రేమా స్వరూపివి నీవే - ఆరాధింతుము నిన్నే(2)
అ.ప. ఆ...హా......హా హల్లెలూయా (3) - ఆ...ఆ... ఆమెన్
1. ఆశ్చర్యకరుడా స్తోత్రం - ఆలోచన కర్తా స్తోత్రం
బలమైన దేవా నిత్యుడవగు తండ్రి - సమాధాన అధిపతి స్తోత్రం(2)
ఆహా.....హ.......హల్లెలూయా
2. కృపా సత్య సంపూర్ణుడా స్తోత్రం - కృపతో రక్షించితివి స్తోత్రం
నీ రక్తమిచ్చి విమోచించినావే - నా రక్షణ కర్త స్తోత్రం (2)
3. ఆమెన్ అనువాడా స్తోత్రం - అల్ఫా ఓమేగా స్తోత్రం
అగ్ని జ్వాలల వంటి కన్నులు కలవాడా - అత్యున్నతుడా స్తోత్రం(2)
4. అతి కాంక్షనీయుడా స్తోత్రం - అతి సుందరుడా స్తోత్రం
అతి మనోహరుడా మహిమాన్వితుడా - ఆరాధ్యుడా నీకు స్తోత్రం(2)
5. స్తుతులపై ఆసీనుడా స్తోత్రం - సంపూర్ణుడా నీకు స్తోత్రం
మా ప్రార్థనలను ఆలించువాడా - మా ప్రధాన యాజకుడా స్తోత్రం(2)
6. మృత్యుంజయుడా స్తోత్రం - మహాఘనుడా స్తోత్రం
మమ్ములను కొనిపోవ త్వరలో రానున్న - మేఘ వాహనుడా స్తోత్రం(2)
