18px
#346Telugu Spiritual Song

Munduke saagedhanu – ika venukaku ne thiruganu

ముందుకె సాగెదను - ఇక వెనుకకు నే తిరుగను

ప|| ముందుకె సాగెదను - ఇక వెనుకకు నే తిరుగను నా మిగిలిన జీవిత దినములన్నియు యేసుతో నడిచెదను || ఆ...హల్లెలూయా || (4)
1. లోకాశలను నేత్రాశలను శరీరాశలను చంపెదను పరిశుద్ధులకు తగినట్లుగ ఈ లోకములో జీవింతును(2)
2. సణుగు గొణుగు - సంశయములను - నా హృదయమునుండి తొలగింతును నూతన బ్రతకు నూతన మనస్సు - నూతన మార్గములో నడిచెదను
3. శోధన శ్రమలు కష్టనష్టములు - ఈలోక యాత్రలో ఎదురైనను ఊపిరినాలో యున్నంతవరకు - క్రీస్తుతో నేను నడిచెదను(2)
4. క్రీస్తుని మంచి సైనికునిగను - అపవాదిని ఎదిరించుటకై దేవుడిచ్చు సర్వాంగ కవచము - ధరియించి నేను పోరాడుదున్(2)
5. వెనుక ఉన్నవి అన్నియు మరచి - ముందున్న వాటికై వేగిరపడుచు దేవుడిచ్చు బహుమానము పొంద - గురియొద్దకే నేను పరుగిడుదును(2)