18px
#348Telugu Spiritual Song

Pallivi : Sarva chittambu needhenaya - Swaroopamicchu kummarivi

సర్వచిత్తంబు నీదేనయ్యా - స్వరూపమిచ్చు కుమ్మరివి

ప|| సర్వచిత్తంబు నీదేనయ్యా - స్వరూపమిచ్చు కుమ్మరివి సారెపై నున్న మంటినయ్యా - సరియైన ప్రాతన్ చేయుమయ్యా సర్వేశ్వరా నే రిక్తుండను - సర్వద నిన్నే సేవింతును
1. ప్రభూ సిద్ధంచు నీ చిత్తమే - ప్రార్థించుచుంటి నీ సన్నిధిన్ పరికింపు నన్నీ దివసంబున - పరిశుభ్రమైన హిమముకన్నా పరిశుద్ధున్ జేసి పాలింపుమా - పాపంబుబోవ ననుకడుగుమా
2. నీ చిత్తమే సిద్ధించు ప్రభూ - నిన్నే ప్రార్థింతు నా రకక్షకా నీచమౌ గాయముల చేతను - నిత్యంబు కృంగి అలసియుండ నిజమైన సర్వశక్తుండవే - నీచేత బట్టినన్ రక్షింపుమా
3. ఆత్మస్వరూప నీ చిత్తమే - అనిశంబు చెల్లు ఇహపరమున అధికంబుగా నన్నీ యాత్మతో - ఆవరింపుమో నా రకక్షకా అందరూ నాలో క్రీస్తుని జూడ - ఆత్మతో నన్ను నింపుము దేవా || సర్వ ||