#349Telugu Spiritual Song
Aascharyamaina prema – kalvariloni prema
ఆశ్చర్యమైన ప్రేమ కల్వరిలోని ప్రేమ - మరణము కంటే బలమైన ప్రేమది నన్ను జయించె నీ ప్రేమ
ప|| ఆశ్చర్యమైన ప్రేమ కల్వరిలోని ప్రేమ - మరణము కంటే బలమైన ప్రేమది నన్ను జయించె నీ ప్రేమ
1. పరమును వీడిన ప్రేమ ధరలో - పాపిని వెదకిన ప్రేమ
నన్ను కరుణించి ఆదరించి - సేదదీర్చి నిత్యజీవమిచ్చె || ఆశ్చర్య ||
2. పావన యేసుని ప్రేమ సిలువలో - పాపిని మోసిన ప్రేమ
నాకై మరణించి జీవమిచ్చి - జయమిచ్చి తన మహిమ నిచ్చె.... || ఆశ్చర్య ||
3. శ్రమలు సహించిన ప్రేమ నాకై - శాపము నోర్చిన ప్రేమ
విడనాడని ప్రేమది - ఎన్నడూ ఎడబాయదు || ఆశ్చర్య ||
4. నా స్థితి జూచిన ప్రేమ నాపై - జాలిని జూపిన ప్రేమ
నాకై పరుగెత్తి కౌగిలించి - ముద్దాడి కన్నీటిని తుడిచే || ఆశ్చర్య ||
