#350Telugu Spiritual Song
Enni thalachinaa edi adiginaa
ఎన్ని తలచినా ఏది అడిగినా - జరిగేది నీ చిత్తమే ప్రభువా
ప|| ఎన్ని తలచినా ఏది అడిగినా - జరిగేది నీ చిత్తమే ప్రభువా(2)
నీ రాకకై వేచియుంటిమి మా ప్రార్థన ఆలకించుమా
ప్రభువా మా ప్రార్థన ఆలకించుమా
1. నీ తోడులేక నీ ప్రేమ లేక - ఇలలోన ఏ ప్రాణి నిలువ లేదు(2)
అడవి పువ్వులే నీ ప్రేమ పొందగ (2) - మా ప్రార్థన ఆలకించుమా ప్రభువా(2)
2. నా యింటి దీపం నీవేయని తలచి - నా హృదయం నీ కొరకై పదిలపరచితి(2)
ఆరిపోయిన నా వెలుగు దీపము (2) - వెలిగించుము నీ ప్రేమతో ప్రభువా(2)
3. ఆపదలు నన్ను వెన్నంటి యున్నా - నా కాపరి నీవై నన్నాదుకొంటివి(2)
లోకమంతయు నన్ను విడచినా (2) - నీ నుండి వేరుచేయవు ప్రభువా(2)
4. నా స్థితి గమనించి నన్ను ప్రేమించి - నా కొరకు కల్వరిలో యాగమైతివా(2)
నీదు యాగమే నా మోక్ష భాగ్యము (2) - నీ యందే నిత్యజీవము ప్రభువా(2)
