#351Telugu Spiritual Song
Bhaasillenu siluvalo paapa kshama
భాసిల్లెను సిలువలో పాపక్షమ - యేసుప్రభు నీ దివ్యక్షమ
ప|| భాసిల్లెను సిలువలో పాపక్షమ - యేసుప్రభు నీ దివ్యక్షమ || భాసిల్లెను ||
1. కలువరిలో నా పాపము పొంచి - సిలువకు నిన్ను యాహుతి జేసె(2)
కలుషహరా కరుణించితివి(2) || భాసిల్లెను ||
2. దోషము చేసినది నేనేగదా - మోసములో బ్రతికిన నేనే గదా(2)
మోసితివా నా శాపభారం(2) || భాసిల్లెను ||
3. పాపము చేసి గతించితి మరణం - శాపమేగా నేనార్జించినది(2)
కాపరివై నన్ను బ్రోచితివి(2) || భాసిల్లెను ||
4. నీ మరణపు వేదన వృధగాదు - నా మది నీ వేదనలో మునిగె(2)
క్షేమము కలిగెను హృదయములో(2) || భాసిల్లెను ||
5. ఎందులకో నాపై ఈ ప్రేమ - అంద దయాస్వామి నా మదికి(2)
అందులకే భయమొందితిని(2) || భాసిల్లెను ||
6. నమ్మినవారిని కాదనవనియు - నెమ్మదినొసగెడి నా ప్రభుడవని(2)
నమ్మితి నీ పాదంబులను(2) || భాసిల్లెను ||
