#352Telugu Spiritual Song
Idhigo nee raju vacchuchunde - Siyonu kumari santhoshinchu
ఇదిగో నీ రాజు వచ్చుచుండె - సీయోను కుమారి సంతోషించు
ప|| ఇదిగో నీ రాజు వచ్చుచుండె - సీయోను కుమారి సంతోషించు
యెరూషలేం కుమారి ఉల్లసించు
1. నీదు రాజు నీతితో - దోషమేమియు లేకయే
పాపరహితుడు ప్రభు - వచ్చుచుండె
2. రక్షణగలవాడుగా - అక్షయుండగు యేసుడు
దీక్షతోడ యెరూషలేం - వచ్చుచుండె
3. సాత్వీకుండు ఈ భువిన్ - అత్యంతమగు
ప్రేమతో నిత్యరాజు నరులకై - వచ్చుచుండె
4. దీనపరుడు నీ ప్రభు - ఘనత కలిగిన దేవుడు
ప్రాణమీయ పాపులకై - వచ్చుచుండె
5. ఇలను గాడిద నెక్కియే - బాలుర స్తోత్రములతో
బలుడగు నీ ప్రభు - వచ్చుచుండె
6. దావీదు కుమారుడు - దేవుడు పాపులకు
జయగీతములతో - వచ్చుచుండె
7. యేసుని ప్రేమించుచు - హోసన్నా పాడెదము
యేసుడిల వచ్చుచుండె - హల్లెలూయా
