18px
#353Telugu Spiritual Song

Hallelujah Yesu Prabhun – Yellaru sthuthiyinchudi

హల్లెలూయా యేసు ప్రభున్ - యెల్లరు స్తుతియించుడి

1. హల్లెలూయా యేసు ప్రభున్ - యెల్లరు స్తుతియించుడి వల్లభుని చర్యలను - తిలకించి స్తుతియించుడి బలమైన పనిచేయు - బలవంతున్ స్తుతియించుడి ఎల్లరిని స్వీకరించు - యేసుని స్తుతియించుడి
ప|| రాజులరాజైన యేసు రాజు భూజనుల నేలున్ - హల్లెలూయా హల్లెలూయా దేవుని స్తుతియించుడి
2. తంబురతోను వీణతోను - ప్రభువును స్తుతియించుడి పాపమును రక్తముతో - తుడిచెను స్తుతియించుడి బూరతోను తాళములన్ - మ్రోగించి స్తుతియించుడి నిరంతరము మారని - యేసుని స్తుతియించుడి
3. సూర్యచంద్రులారా ఇల - దేవుని స్తుతియించుడి హృదయమును వెలిగించిన - యేసుని స్తుతియించుడి అగ్ని వడగండ్లారా మీరు - కర్తను స్తుతియించుడి హృదయమును ఒప్పించిన - నాధుని స్తుతియించుడి
4. యువకులారా పిల్లలారా - దేవుని స్తుతియించుడి జీవితమున్ ప్రభు పనికై - సమర్పించి స్తుతియించుడి పెద్దలారా ప్రభువులారా - యెహోవాను స్తుతియించుడి ఆస్తులను యేసునకై - అర్పించి స్తుతియించుడి
5. అగాధమైన జలములారా - దేవుని స్తుతియించుడి అలలవలె సేవకులు - లేచిరి స్తుతియించుడి దూతలారా పూర్వభక్తులారా - దేవుని స్తుతియించుడి పరమందు పరిశుద్ధులు - ఎల్లరు స్తుతియించుడి