18px
#354Telugu Spiritual Song

Samastha desamulaara andaru paadudi - Andaru paadudi

సమస్త దేశములారా అందరు పాడుడి - అందరు పాడుడి

ప|| సమస్త దేశములారా అందరు పాడుడి - అందరు పాడుడి
అ.ప. అందరు యెహోవాకు ఉత్సాహ ధ్వని చేయుడి
1. సంతోషముగను యెహోవాను సేవించుడి ఉత్సాహ గానము చేయుచు సన్నిధికి రండి || సమస్త ||
2. యెహోవాయే మీ దేవుడని తెలిసికొనుడి ఆయనే మనలను కలుగజేసినవాడు || సమస్త ||
3. మనమెల్లర మాయనకు ప్రజల మైతిమి ఆయన మేపు గ్రొరెలమై యున్నవారము || సమస్త ||
4. కృతజ్ఞతార్పణలతోను గుమ్మములలో ఆవరణములలో కీర్తనలతో ప్రవేశించుడి || సమస్త ||
5. ఆయనను స్తుతించుడి ఆయనను స్తుతించుడి ఆయన నామమునకు స్తుతులు చెల్లించుడి || సమస్త ||
6. దయామయుండగు యెహోవా కృప నిత్యము ఆయన సత్యము తరతరములుండును || సమస్త ||