18px
#355Telugu Spiritual Song

Udaya saayanthramula nellavelala prabhuvaa

ఉదయ సాయంత్రముల నెల్లవేళల ప్రభువా నే ధ్యానించి పాడెదన్

ప|| ఉదయ సాయంత్రముల నెల్లవేళల ప్రభువా నే ధ్యానించి పాడెదన్ పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుండని - దూతలు పాడుట వినబడుచుండున్
1. యెహోవాయే నాకు వెలుగు రక్షణయు - నే నెవరికి వెరతును యెహోవాయే నా ప్రాణ దుర్గంబాయె - శత్రువులు ' - ్రటిల్లిరి || ఉదయ ||
2. యుద్ధము చేయుటకు దండు దిగినను - నా హృదయము భయపడదు యుద్ధము రేగినను దీనియందు నే - ధైర్యము విడువకుందున్ || ఉదయ ||
3. యెహోవా యొద్ద వరమొక్కటడిగితిని - దానిని వెదకుచున్నాను యెహోవా ప్రసన్నత జూచి ఆలయమున - ధ్యానించుటయే నా ఆశ || ఉదయ ||
4. తన పర్ణశాలలో నను జేర్చికాచును - నా ఆపత్కాలమునందు తన గుడారములోన నను దాచియుంచును - దుర్గముపై నెక్కించున్ || ఉదయ ||
5. నా సన్నిధి వెదకి నా స్వరము వినుమని - నీవు పల్కితివి గాన నీ సన్నిధిని వెదకి నీ స్వరమే వినెదను - నీ సముఖమును దాచకు || ఉదయ ||
6. నా తల్లిదండ్రులు నన్ను విడచినను - యెహోవాయే చేరదీయున్ నే ధైర్యము కలిగి నిబ్బరముగ నుండెద - నీ కొరకు కనిపెట్టెదన్ || ఉదయ ||
7. యెహోవా నాకై యుద్దేశించినది - ఆయనయే నెరవేర్చును మహోన్నతుని మాటకు భయపడెడి - పరిశుద్ధుల కోరికలు నెరవేర్చును || ఉదయ ||