18px
#356Telugu Spiritual Song

Samastha janulaara meeru Yehovaku sthuthi geethamu paadi

సమస్త జనులారా మీరు యెహోవాకు

ప|| సమస్త జనులారా మీరు యెహోవాకు స్తుతిగీతము పాడి సంతోషముతో సన్నిధిలో - ఉత్సాహించుడి జయమనుచు
1. తానె యొనర్చె మహకార్యములన్ - పాపిని రక్షింప బలియాయెన్ శత్రుని రాజ్యము కూలద్రోసెను - స్మరియించుడి మీరందరును ఆయనను స్తుతియించుడి || సమస్త ||
2. జ్ఞాపకముంచుకో ఇశ్రాయేలు - విడిపించె నైగుప్తునుండి నలువది వత్సరములు నడిపించె - కానానుకు మిమ్ము చేర్చుటకు ఆయనను స్తుతియించుడి || సమస్త ||
3. మోషేకు తన సేవను నొసగె - యెహోషువా జయమును పొందె శత్రుని గెల్చి రాజ్యము పొందె - ఘన కార్యములను స్మరియించి ఆయనను స్తుతియించుడి || సమస్త ||
4. మీరే ప్రభుని స్వంత ప్రజలుగా - కొనె మిమ్ము తన రక్తముతో ఆత్మల చేర్చి సంఘము కట్టె - ఆ రీతిని కని స్మరియించు ఆయనను స్తుతియించుడి || సమస్త ||
5. పిలిచెను ప్రభువు సేవకు మిమ్ము - నేడే వినుమాయన స్వరము అర్పించుడి మీ జీవితములను - సాగిలపడి ఆయన యెదుట ఆయనను స్తుతియించుడి || సమస్త ||