#358Telugu Spiritual Song
Sthutinchudi Yehova devuni Soorya chandrularaa
స్తుతించుడి యెహోవా దేవుని సూర్యచంద్రులారా
ప|| స్తుతించుడి యెహోవా దేవుని సూర్యచంద్రులారా
పవిత్ర దూతగణ సేనాధిపతికి - ఉన్నత స్థలములలో
యెహోవాను స్తుతించుడి
1. కాంతిగల నక్షత్రములారా - పరమాకాశమా ఆకాశజలమా
ఆవిరి హిమమా అగ్ని తుఫానూ - మహా సముద్ర పర్వత వృక్ష
మృగములు పశువులారా - ప్రశంసించుడి, ఫలవృక్షములు పరమతండ్రిని
యెహోవాను స్తుతించుడి || స్తుతించుడి ||
2. రాజులు ప్రజలు - న్యాయాధిపతులు అధిపతులారా
బాలురు యౌవన కన్యక వృద్ధులు - ప్రభుని స్తుతించుడి
ప్రాకు జీవులు పలు విధ పక్షులు - పాడి స్తుతించుడి
ప్రశంసించుడి ప్రభావ మహిమలు
పరమతండ్రిని - యెహోవాను స్తుతించుడి || స్తుతించుడి ||
