18px
#359Telugu Spiritual Song

Stutinchudi meeru stutinchudi

స్తుతించుడి మీరు స్తుతించుడి

ప|| స్తుతించుడి మీరు స్తుతించుడి యెహోవా దేవుని స్తుతించుడి - స్తుతించుడి
1. ఓ దూతలారా పరమ సైన్యమా - సూర్యచంద్రులారా తారాగణమా ప్రభువునే స్తుతించుడి || స్తుతి ||
2. పరమాకాశమా పైనున్న జలమా - సృష్టికర్తను స్తుతించుడి నాథుని స్తుతించుడి || స్తుతి ||
3. మకరములారా అగాధ జలమా - అగ్ని వడగండ్లు ఆవిరి హిమమా కర్తను స్తుతించుడి || స్తుతి ||
4. పర్వత శిఖర వృక్షములారా - మృగ పక్షి ప్రాకు పురుగులారా కాపరిని స్తుతించుడి || స్తుతి ||
5. భూరాజులారా సర్వ ప్రజలారా - అధిపతులు యౌవనులు కన్యకలు రారాజుని స్తుతించుడి || స్తుతి ||
6. మహోన్నతుండు ఇహ పరములలో - ఐశ్వర్యవంతుని స్తుతించుడి దేవుని స్తుతించుడి || స్తుతి ||
7. ప్రజలెల్లరికి రక్షణ శృంగము - ఇశ్రాయేలీయులకు భక్తులకును తండ్రిని స్తుతించుడి || స్తుతి ||