#360Telugu Spiritual Song
Santhoshame santhoshame-Santhoshamutho sthutinchedhan
సంతోషమే సంతోషమే - సంతోషముతో స్తుతించెదన్
ప|| సంతోషమే సంతోషమే - సంతోషముతో స్తుతించెదన్
క్రీస్తు యేసు రక్షించినన్ - చేర్చెను తన మందలో
1. ఘోర దుర్మార్గుడనై - దారి తప్పియుండగా
భూరి దయతో కాపరి యేసు - దారికి నడిపెను || సంతో ||
2. అక్షయమైనదియు - నిర్మలమైనదియు రక్షకుడేసు
వాడబారని స్వాస్థ్యము నాకిచ్చును || సంతో ||
3. భయమేమి లేదికను - ప్రభు చిన్న మందకు
దయ కృపతో రాజ్యమివ్వ - తండ్రికిష్టమాయెన్ || సంతో ||
4. మంటి పురుగునకు - మింట రాజ్యమివ్వ
మింటనుండి మంటి కేతెంచి - మరణ మొందె నేసు || సంతో ||
5. దేవా నీ తలంపులు - నాకు ప్రియమైనవి
శోధింప నెంతో అశక్యములు - ఆగమ్యములు || సంతో ||
6. నిజకుమారుడేసున్ - మన కనుగ్రహించెను
రాజ్యముతో బాటు సమస్తము నివ్వ - వెనుదీయునా? || సంతో ||
7. మహిమ రాజ్యమునకు - మిమ్మును పిలుచుచున్న
మహిమ రాజుకు తగినట్టుగా - మీరు నడచుకొనుడి || సంతో ||
8. రాజాధిరాజు యేసే - ప్రభుల ప్రభు యేసే
పరమందు దూతలు - యిహమందు నరులు హల్లెలూయ పాడుడి || సంతో ||
