#361Telugu Spiritual Song
Stothramu yesunadhaa neeku sadhaa
స్తోత్రము యేసునాథా నీకు సదా
1. స్తోత్రము యేసునాథా నీకు సదా
స్తోత్రము యేసునాథా స్తోత్రము చెల్లింతుము
దాసులము - పిత్రపుత్రాత్మలకు
2. నేడు నీదు నామమందున - మేము - చేరి
స్తుతించునట్లు చేసిన కృపకై నీకే నిరతము - స్తోత్రము చేసెదము
3. నీదు రక్తధారచే కలిగిన సజీవ నవమార్గము
దాసులము తండ్రి సన్నిధిచేరను నిత్యము స్వాతంత్ర్యము
4. ఇట్టి ప్రభావమైన పదవిని - పురుగులమగు మాకు
ఇంత దయతోడ నిచ్చిన కృప మా కెంతయు నాశ్చర్యము
5. దూతల సైన్యములు శృంగార - గీతములనెప్పుడు
రాజాధిరాజా నీ స్తుతులు పాడుచు - నార్భటించుచుందురు
6. నీవు తప్ప మాకు పరమందున - వేరెవరు గలరు?
ఇద్ధరయందు నీవు తప్ప - మాకు ఆదరణ ఎవరు?
