#362Telugu Spiritual Song
Adavi chetla naduma - Oka jaldaru vruksham vale
అడవి చెట్ల నడుమ - ఒక జల్దరు వృక్షంవలె
ప|| అడవి చెట్ల నడుమ - ఒక జల్దరు వృక్షంవలె
పరిశుద్ధుల సమాజములో - యేసు ప్రజ్వలించుచున్నాడు(2)
అ.ప. కీర్తింతున్ నా ప్రభుని - జీవకాలమెల్ల
ప్రభుయేసుని కృతజ్ఞతతో స్తుతించెదను(2)
1. షారోను రోజా ఆయనే - లోయ పద్మమును ఆయనే
అతి పరిశుద్ధుడు ఆయనే - పదివేలలో అతిశ్రేష్ఠుడు(2) || కీర్తింతున్ ||
2. పరిమళ తైలం నీ నామం - దాని వాసన వ్యాపించెగా
నిందశ్రమ సంకటములో - నను సుగంధముగా చేయున్(2) || కీర్తింతున్ ||
3. మనోవేదన సహించలేక - సిలువైపునే చూడగా
లేవనెత్తి నన్నెత్తుకొని - భయపడకుమని యంటివి(2) || కీర్తింతున్ ||
4. నా త్రోవకు దీపం నీవే - నా బ్రతుకుకు జీవం నీవే
నా సేవకు బలము నీవే - నా ఆత్మకాదరణ నీవే(2) || కీర్తింతున్ ||
5. ఘనమైన నా ప్రభువా - నీ రక్త ప్రభావమున
నా హృదయము కడిగితివి - నీకే నా స్తుతి ఘనత(2) || కీర్తింతున్ ||
