18px
#364Telugu Spiritual Song

Aahaa aanandame - paramaanandame-Priya yesu nosage naaku

ఆహా ఆనందమే పరమానందమే - ప్రియ యేసు నొసగె నాకు

ప|| ఆహా ఆనందమే పరమానందమే - ప్రియ యేసు నొసగె నాకు కొలత లేనిది బుద్ధికందనిది - ప్రేమన్ వివరింప వీలగునా?
1. నీచ ద్రోహినైన నన్ - ప్రేమతో చేర్చుకొని(2) పాప ఊబి నుండి నన్ - పైకి లేవనెత్తెను(2)
2. నిత్య నాశన పురముకు - నే పరుగిడి వెళ్లుచుండ(2) నిత్యజీవ మార్గములో - నన్ను నడిపితివి(2)
3. నలిగిన రెల్లువలె - నేను విరిగెడి సమయములో(2) నాకై విజ్ఞాపన చేసి - స్థిరపరచితివి ప్రేమతో(2)
4. మధ్యాకాశమునందున - ప్రభుని చేరెడు వేళలో(2) ఆనందమానందమే - ఎల్లప్పుడానందమే(2)