#365Telugu Spiritual Song
Krottha geethamuche naa yullamuponga-Yesuni keerthinthunu
క్రొత్త్త గీతముచే నా యుల్లముప్పొంగ - యేసుని కీర్తింతును
1. క్రొత్త్త గీతముచే నా యుల్లముప్పొంగ - యేసుని కీర్తింతును
పరిమళ తైలమును పోలిన - నీ నామమునే ప్రేమింతును
ప. హల్లెలూయా స్తుతి హల్లెలూయా - నా ప్రభు యేసుని గూర్చి పాడెదను
ఇట్టి కృపను నాకు నిత్యము నిచ్చిన - ప్రభుని కీర్తింతును
2. గత కాలమంతయు కాపాడెన్ - కష్టబాధలు కలుగకుండ
తన ఆశీర్వాదంబులు నా కొసగి - సుఖభద్రతనిచ్చెన్
3. కొన్ని వేళలు క్షణకాలము - తన ముఖమును కప్పుకొనెను ప్రభువే
తన కోపము మాని తిరిగి నా యెడల - కుమ్మరించును కృపను
4. కరువు లధికంబగు చుండినను - ప్రభు ఆశ్రయముగనుండు
పలు స్థలములలో వ్యాధులు వ్యాపింపగ - ప్రభు మమ్ము కాపాడెన్
5. ప్రభు త్వరగా వచ్చును సంతసముగ - మమ్ము జేర్చను పరమందు
కనిపెట్టెద మనిశం నింగిని - జూచుచు ఆశతో గాంచెదము
