#371Telugu Spiritual Song
Prema gala maa prabhuva-Prema yai yunna vayaa
ప్రేమగల మా ప్రభువా ప్రేమయై యున్నావయా
ప|| ప్రేమగల మా ప్రభువా ప్రేమయై యున్నావయా
1. నీదు ప్రేమ నిత్యమైనది - కరుణతో నాకర్షించె
నిక్కముగ ఋజువాయెను - ప్రాణమిచ్చుట ద్వారానే || ప్రేమ ||
2. అందరిని రక్షించగోరి - లోకమును ప్రేమించెను
అద్భుత ప్రేమయిదే - పాపములను కప్పెను || ప్రేమ ||
3. బలమగు ఈ ప్రేమ - మనల క్రీస్తులో బంధించెను
వల్లపడదు ఎవరికి - క్రీస్తు ప్రేమను బాపను || ప్రేమ ||
4. తల్లియైన మరచుగాని - నీవు యెన్నడు మరువవు
తండ్రి ప్రేమ మారదు - మార్పుచెందని ప్రేమయే || ప్రేమ ||
5. మరణమంత బలముగలది - నీదు ప్రేమ ప్రభువా
వరదలార్పజాలవు - విజయుడా నీ ప్రేమను || ప్రేమ ||
