18px
#372Telugu Spiritual Song

Aaraadhincheda ninu madi pogadeda

ఆరాధించెద నిను మది పొగడెద - నిరతము నిను స్తుతియించెదను

ప|| ఆరాధించెద నిను మది పొగడెద - నిరతము నిను స్తుతియించెదను మార్గము నీవె సత్యము నీవె - జీవము నీవే నా ప్రభువా
1. విస్తారంబగు వ్యాపకములలో - విడచితి నీ సహవాసమును సరిదిద్దితివి నా జీవితము - నిను సేవింపగా నేర్పిన ప్రభువా || ఆరా ||
2. నా జీవితమున నీ మాటలను - వినుటయే చాలని యెరిగితిని నా కన్నీటితో నీ పాదములను - కడుగుట నేర్పిన ఓ నా ప్రభువా || ఆరా ||
3. వ్యర్థపరచితిని నా సర్వమును - స్వార్థముతో జీవించితిని గుర్తించితిని నీ త్యాగమును - వినయముతో నీ సన్నిధిచేరి || ఆరా ||
4. నీ రక్తముతో నన్ను కడిగితివి - పరిశుద్ధునిగా జేసితివి నీ రక్షణకై స్తోత్రము చేయుచు - నిత్యము నిన్ను కొనియాడెదను || ఆరా ||
5. దుర్గంధముతో నిండిన నన్ను - దయతో నీవు పిలిచితివి ప్రేమతో పరమ విందు నొసంగి - ఆనందింపగ జేసిన ప్రభువా || ఆరా ||
6. ప్రియముగ దాచిన అత్తరు భరణి - పగులగొట్టి నిన్ను పూజింతు నీ ప్రేమను నే నెన్నగ తరమా - నా జీవితమున చాలిన ప్రభువా || ఆరా ||
7. పెద్దలు పరిశుద్ధులు ఘనదూతలు - నీ సన్నిధిలో నిలచినను లెక్కింపగ జాలని జనమందున - నను గుర్తింతువు నా ప్రియ ప్రభువా || ఆరా ||