#373Telugu Spiritual Song
Ruchi choochi yerigitini - yehovaa utthamudaniyu
రుచి చూచి ఎరిగితిని - యెహోవా ఉత్తముడనియు
ప|| రుచి చూచి ఎరిగితిని - యెహోవా ఉత్తముడనియు
రక్షకునాశ్రయించి - నే ధన్యుడనైతిని
1. గొప్ప దేవుడవు నీవే స్తుతులకు పాత్రుడ వీవే
తప్పక ఆరాధింతు దయాళుడవు నీవే || రుచి ||
2. మహోన్నతుడవగు దేవా - ప్రభావము గలవాడా
మనస్సార పొగడెదను నీ - ఆశ్చర్య కార్యములన్ || రుచి ||
3. మంచి తనము గల దేవా - అతి శ్రేష్ఠుడవు అందరిలో
ముదమార పాడెద నిన్ను - అతి సుందరుడవనియు || రుచి ||
4. నా జీవితమంతయును - యెహోవాను స్తుతియించెదను
నా బ్రతుకు కాలములో - నా దేవుని కీర్తింతున్ || రుచి ||
5. సంతోషింతు నెల్లప్పుడు - కష్ట దుఃఖ బాధలలో
ఎంతో నెమ్మదినిచ్చునా - రక్షకుడు యేసు || రుచి ||
6. ప్రార్థింతును ఎడతెగక ప్రభుసన్నిధిలో చేరి
సంపూర్ణముగా పొందెదను అడుగు వాటన్నిటిని || రుచి ||
7. కృతజ్ఞత చెల్లింతు ప్రతి దానికొరకు నేను
క్రీస్తుని యందే తృప్తి పొంది హర్షించెదను || రుచి ||
