18px
#374Telugu Spiritual Song

Needu viswasyatha maa prabhu yesu

నీదు విశ్వాస్యత మా ప్రభుయేసు - అంతరిక్షమునధిగమించెను

ప|| నీదు విశ్వాస్యత మా ప్రభుయేసు - అంతరిక్షమునధిగమించెను
1. నిను ప్రేమించి నీ ఆజ్ఞలను - అనుసరించు మనుజావళికి నిబంధనను స్థిరముగజేసి - నిరతము నలరారెడు మా ప్రభువా || నీదు ||
2. వేయి తరముల వరకు సరిగా - విలసిల్లేటి వెలలేని మా వింతల కృపాంబుధియగుదేవా - యెంతయో నిను స్తుతియింతుము కోరి || నీదు ||
3. నీ సత్య సంధత్వ మహిమ - నిరతము నిలయం సంస్తుతులకు మెరసెను నా మదిలోన దేవా - మరువగ లేమీ మధుర ప్రేమ || నీదు ||
4. ఎంతైనను నమ్మదగిన - వింతైన నీ విశ్వాస్యత వాత్సల్యత వెలసెను మాపై - క్రొత్త్తగ ప్రతిదినము యేసుప్రభో || నీదు ||
5. మన ఆత్మను జీవము దేహమును - మన ప్రభుయేసు రాకడవరకు ఒనరుగ కాపాడునుపదిలముగా - దిన దినమును నిందారహితముగ || నీదు ||
6. తండ్రి కుమార శుద్ధాత్మకును - తర తరములకు మహిమ ఘనత పరిపూర్ణముగా ప్రబలునుగాక - పరిపరి విధముల ప్రభు సంఘములో || నీదు ||