18px
#375Telugu Spiritual Song

Sannuthinchedanu ellappudu

సన్నుతించెదను ఎల్లప్పుడు - నిత్యము ఆయన కీర్తి నా నోటనుండు

ప|| సన్నుతించెదను ఎల్లప్పుడు - నిత్యము ఆయన కీర్తి నా నోటనుండు
1. యెహోవాకు ప్రార్థించగా - నా భయమంత తొలగించెను శ్రమలన్నిటిలో నాతో నుండి (2) - చేరదీసి నన్ను ఆదరించె ఆరాధించెద నెల్లప్పుడు || సన్నుతి ||
2. జీవితమంతా పాడుచుందును - నీ మేలులకు ఓ ప్రభువా నా ఆయుష్కాల మంతయును (2) - నీ విశ్వాస్యత కొరకెప్పుడు నిరతము నిన్ను స్తోత్రింతు || సన్నుతి ||
3. మహోన్నతమైనది నీదు మహిమ - ఘనత ప్రభావముగల ప్రభువా తనివి తీరగ నిను పూజింతు (2) - తరగని నీ కార్యములకై తప్పక నిన్ను స్తుతియింతు || సన్నుతి ||
4. నీ సంకల్పమును నెరవేర్చి - నడిపించితివి ఘనముగను నాకు ప్రభుడవై నా కాపరివై (2) - నా జీవితములో వున్నావు నిజముగ నిన్ను పొగడెదను || సన్నుతి ||