18px
#376Telugu Spiritual Song

Gaayamulan gaayamulan- Naa korakai pondenu kristu prabhu

గాయములన్, గాయములన్ - నా కొఱకై పొందెను క్రీస్తు ప్రభు

ప|| గాయములన్, గాయములన్ - నా కొఱకై పొందెను క్రీస్తు ప్రభు
1. సురూపమైన సొగసైన లేదు - దుఃఖ భరితుడాయెను వ్యాధిగ్రస్తుడుగా వ్యాకులమొందెన్ - వీక్షించి త్రిప్పిరి ముఖముల్ || గాయ ||
2. మా రోగములను మా దుఃఖములను - మనకై తానే భరియించె మొత్తబడెను బాధించబడెను - యెంతో శ్రమనొందె మనకై || గాయ ||
3. మా అతిక్రమ క్రియలనుబట్టి - మరి నలుగగొట్టబడెను తాను పొందిన దెబ్బలద్వారా - స్వస్థత కలిగె మనకు || గాయ ||
4. పాపంబు కపటంబు లేదు ప్రభునందు - మౌనము వహియించె మనకై ప్రాణంబు మనకై ప్రియముగా నర్పించె - ప్రభువే ఘోర సిలువపై || గాయ ||
5. క్రీస్తు ప్రేమను మరువజాలము - యెంతో ప్రేమించె మనల సిలువపై మేము గమనించ మాకు - విలువైన విడుదల గలిగె || గాయ ||