18px
#377Telugu Spiritual Song

Doota ganamulella aaraadhinchiri gaa

దూతగణములెల్ల ఆరాధించిరిగా - పరిశుద్ధుడు సైన్యముల యెహోవని

ప|| దూతగణములెల్ల ఆరాధించిరిగా - పరిశుద్ధుడు సైన్యముల యెహోవని
అ.ప. ఇహపరములలో ఆయన మహిమ - నిండియున్నదని గానము చేసిరి(2)
1. నిష్కళంకమైనది నీ కనుదృష్టి - నీవు చూడలేవుగా దుష్టత్వమును దూరస్థులమైన మమ్ము నీ రక్తముతో - చేరదీసి చేర్చుకొన్న స్వామి స్తోత్రము || దూత ||
2. నా హృదయమునందు శుద్ధి కలిగించితివి - నిన్ను చూచె నిరీక్షణ నా కొసగితివి పెన్నుగా నీ పరిశుద్ధత నొసగిన దేవా - ఘనముగాను పొగడెదను పావన ప్రభువా || దూత ||
3. పాపముతో పతనమైన నా దేహమును - పరిశుద్ధాలయముగాను చేసికొంటివి పరిశుద్ధ స్వాస్థ్యమునకు నన్ను పిలచిన - సర్వోన్నతుడా నిన్ను స్తుతియించెదను || దూత ||
4. నీ రక్తముచేత నాకు కలిగించితివి - నిర్భయంబుగాను పరిశుద్ధ స్థలములో ప్రవేశింపజేసియున్న ప్రియ యేసువా - పూజించెద నిన్ను నాదు జీవితమంతా || దూత ||
5. పరలోకపు తండ్రి నీవు పరిపూర్ణుడవు - పరిపూర్ణతయందు నన్ను నడిపించితివి సమస్తమును చేయుటకు బలపరచితివి - సమాధానకర్త నీకే వందన స్తుతులు || దూత ||