#378Telugu Spiritual Song
Maa prabhu yesu neeve maa sarvamu
మా ప్రభుయేసు నీవే మా సర్వము - మహిన్ మాకెపుడు నీతోనే స్నేహము
ప|| మా ప్రభుయేసు నీవే మా సర్వము - మహిన్ మాకెపుడు నీతోనే స్నేహము
1. సంతృప్తి నీ మందిరమున గలదు - అందానంద ప్రవాహంబు మెరిసింది
వింతైన జీవపు యూటందు గలదు - యెంతైన మా పూజార్హుండ వీవే || మా ||
2. ఇంతటి ప్రేమను నేనెంతో పొందియు - మొదటి ప్రేమనెంతో విడచి పెట్టితిని
సదయాక్షమించి మొదటి ప్రేమ నిమ్మయా - సతతంబు మా పూజార్హుండ వీవె || మా ||
3. మా తలపు మాటల్లో మా చూపు నడకలో - మేము కూర్చున్న నిలుచున్న వీక్షించిన
మక్కువతో మా ప్రభున్ మెప్ప్పించెదము - యెక్కడైనా మా యేసు సన్నిధిలో || మా ||
4. పరిశుద్ధంబైనది నీ దివ్య నైజము - పరిశుద్ధంబైన జీవితమే మా భాగ్యము
పరిశుద్ధ ప్రజలుగ మమ్ము సరిజేసి - పాలించుము ప్రభుయేసు రారాజా || మా ||
5. సోదర ప్రేమ సమాధానంబులతో - సాత్వీక సంతోష భక్తి వినయాలతో
వింతైన మాదు స్తుతి పరిమళాలతో - వినయంబున పూజింతుము నిన్ను || మా ||
