18px
#379Telugu Spiritual Song

Pranutinthumu maa Yehovaa – paripoorna mahima prabhaava

ప్రణుతింతుము మా యెహోవా - పరిపూర్ణ మహిమ ప్రభావా

ప|| ప్రణుతింతుము మా యెహోవా - పరిపూర్ణ మహిమ ప్రభావా ప్రబలెన్ నీ రక్షణ మా విభవా
1. నేను నిదురబోయి మేలుకొందును - నాపైన పదివేలు మోహరించినను నేనెన్నడు వెరువబోను || ప్రణు ||
2. నా మీదికి లేచి బాధించువారు - వానికి రక్షణ లేదనువారు వేలాదిగా నిల్చినారు || ప్రణు ||
3. యెలుగెత్తి యెహోవా సన్నిధియందు - విలపించి వేడినయట్టి దినమందు వింతగ రక్షించితివంచు || ప్రణు ||
4. రక్షణనిచ్చుట మన యెహోవాది - రారాజు ప్రజలకు ఆశీర్వాదంబు రంజిల్లు నీ ధరణియందు || ప్రణు ||