#380Telugu Spiritual Song
Nammaka maina naa prabhu
నమ్మకమైన నా ప్రభు నిన్ను నే స్తుతింతును - నిన్ను నే స్తుతింతును
ప|| నమ్మకమైన నా ప్రభు నిన్ను నే స్తుతింతును - నిన్ను నే స్తుతింతును
1. కరుణతోడ - పిల్చియు - స్థిరపరచి కాపాడిన
స్థిరపరచిన - నా ప్రభున్ - పొగడి నే స్తుతింతును || నమ్మ ||
2. ఎన్నోసార్లు నీ కృపన్ - విడచియుంటినో ప్రభు
మన్ననతోడ - నీ దరిన్ చేర్చినన్ క్షమించితివి || నమ్మ ||
3. కృంగియుండు వేళలో పైకి లేవనెత్తితివి
భంగపరచు - సైతానున్ గెల్చి - విజయమిచ్చితివి || నమ్మ ||
4. నాకాశ్రయశైలమై - కోటగా నీవుంటివి
ప్రాకారంపు - యింటివై - నన్ను దాచియుంచితివి || నమ్మ ||
5. సత్యసాక్షివై యుండి - నమ్మదగినవాడవై
నిత్యుడౌ మా దేవుడా - ఆమేనంచు పాడెద || నమ్మ ||
