#381Telugu Spiritual Song
Rakshakudaa yesu prabho stotramu devaa
రక్షకుడా యేసు ప్రభో స్తోత్రము దేవా
ప|| రక్షకుడా యేసు ప్రభో స్తోత్రము దేవా
స్వచ్ఛమైన నిత్య ప్రేమ చూపిన దేవా || రక్షకుడా ||
1. దేవుడే నా పక్షమైన విరోధెవ్వడు? - దూతలైనను - ప్రధానులైనను
ప్రభువు ప్రేమ నుండి నన్ను వేరుచేయునా?
2. నరరూపమెత్తి ప్రభువు రిక్తుడాయెను - కరువైనను ఖడ్గమైనను
ప్రభువు ప్రేమ నుండి నన్ను వేరుచేయునా?
3. సర్వలోక రక్షణకై సిలువనెక్కెను - శ్రమయైనను బాధయైనను
ప్రభువు ప్రేమ నుండి నన్ను వేరుచేయునా?
4. ఎంచలేని యేసునాకై హింసపొందెనే - హింసయైనను హీనతయైనను
ప్రభువు ప్రేమ నుండి నన్ను వేరుచేయునా ?
5. మరణమున్ జయించి క్రీస్తు తిరిగి లేచెను - మరణమైనను జీవమైనను
ప్రభువు ప్రేమ నుండి నన్ను వేరుచేయునా?
6. నిత్యుడైన తండ్రితో నన్ను జేర్చెను - ఎత్తైనను లోతైనను
ప్రభువు ప్రేమ నుండి నన్ను వేరుచేయునా?
7. ఎన్నడైన మారని మా యేసుడుండగా - ఉన్నవైనను రానున్నవైనను
ప్రభువు ప్రేమ నుండి మమ్ము వేరుచేయునా?
హల్లెలూయ హల్లెలూయ ఆమెన్ హల్లెలూయ
