18px
#382Telugu Spiritual Song

Stuti prashamsa paaduchu – Keertintu nityamu

స్తుతి ప్రశంసపాడుచు కీర్తింతు నిత్యము

ప|| స్తుతి ప్రశంసపాడుచు కీర్తింతు నిత్యము మహారక్షణ నిచ్చియు మనశ్శాంతి నిచ్చెను
1. పాపలోక బంధమందు దాసత్వమందుండ నీ రక్తశక్తిచేత ప్రభు విమోచించితివి || స్తుతి ||
2. పాప భారముచే నేను దుఃఖము పొందితి నా ప్రభువే భరించెను నా దుఃఖ బాధలు || స్తుతి ||
3. హృదయాంధకారముచే నేను దారి తొలగితి ప్రభువే జ్యోతియాయెను - సత్యమార్గము చూపె || స్తుతి ||
4. పెంటకుప్ప నుండి నన్ను లేవనెత్తితివి దరిద్రుడనైన నన్ను రాజుగా జేసితివి || స్తుతి ||