18px
#383Telugu Spiritual Song

Anudhinamu maa bharamu – bharinche devaa

అనుదినము మా భారము - భరించే దేవా

ప|| అనుదినము మా భారము - భరించే దేవా అనిశము నీ మేళ్లతో - నింపుచున్నావు
1. సన్నుతించు మనిశము - నా ప్రాణమా యేసుని పరిశుద్ధ నామమును - పొగడు మెప్పుడు ఒంటె బరువు దీవెనలు - వీపున మోపె || అను ||
2. నా శరీరమున ముల్లు - బాధ పరచుచుండగా వేదనతో వేడగా ధైర్యమిచ్చితివి - నా కృప నీకెల్లప్పుడు చాలునంటివి || అను ||
3. అపరాధముతో మేము చిక్కుకొని యుండగా నీ రక్తముచే మమ్ము విమోచించితివి - నీదు కృపా మహదై శ్వర్యంబును బట్టి || అను ||
4. అన్నిటిలో నెప్పుడు సకల సంపదలతోను - సమృద్ధితో మమ్ములను సాకుచుంటివి - కృపాక్షేమములను మాపై కుమ్మరించితివి || అను ||
5. సర్వవేళల సంతృప్తిని నేర్పినావు మాకిల - సకలంబును చేయుటకు శక్తినిచ్చితివి బలపరచుము నిన్నుబట్టి - బలుడగు దేవా || అను ||