18px
#384Telugu Spiritual Song

Bhajiyimpa randi prabhu Yesuni

భజియింప రండి ప్రభుయేసుని

ప|| భజియింప రండి ప్రభుయేసుని ఆత్మసత్యములతో ప్రేమామయుని పరమతండ్రిని
1. పాపక్షమాపణ మనకిచ్చెను - మనల విమోచించె రక్తముతో జయము జయము మన ప్రభుకే || భజియింప||
2. ఆత్మమందిర ప్రత్యక్షత నొసగెన్ - నేత్రము తెరచెను యేసుని చూడ ఆశ్చర్యకరుడు సదాకాలము || భజియింప||
3. ఘనత పొంద సదా రాజ్యమునిచ్చె - స్వాస్థ్యము పొంద వారసులమైతిమి హోసన్న హోసన్న విజయునికే || భజియింప||
4. జగమును జయించే జీవితమునిచ్చె - సిలువ శక్తిచే మనలను గాచెగా స్తుతులర్పింతుము ముక్తిదాతకే || భజియింప||
5. సంఘము ప్రభుని చేర తేరిచూచెగా - సదాకాలమాయనతో నుండ నెప్పుడు సాగిలపడెదము సృష్టికర్తకే || భజియింప||