18px
#385Telugu Spiritual Song

Bhakhtulaaraa smariyinchedamu-prabhu chesina melulannitini

భక్తులారా స్మరియించెదము ప్రభుచేసిన మేలులన్నిటిని

ప|| భక్తులారా స్మరియించెదము ప్రభుచేసిన మేలులన్నిటిని అడిగి ఊహించు వాటికన్న మరి సర్వము చక్కగ జేసె
1. శ్రీయేసే మన శిరస్సై యుండి - మహా బలశూరుండు సర్వమునిచ్చెను తన హస్తముతో - ఎంతో దయగలవాడు || భక్తు ||
2. గాలి తుఫానులను గద్దించి - బాధలను తొలగించె శ్రమలలో మనకు తోడైయుండి - బయలు పరచె తన జయమున్ || భక్తు ||
3. జీవనదిని ప్రవహింపజేసె - సకల స్థలంబులయందు లెక్కకుమించిన ఆత్మలతెచ్చె - ప్రభువే స్తోత్రార్హుండు || భక్తు ||
4. అపొస్తలుల, ప్రవక్తలను - సువార్తికులను యిచ్చె సంఘము అభివృద్ధిని చెందుటకు - సేవకులందరినిచ్చె || భక్తు ||
5. మన పక్షమున తానే పోరాడి - సైతానును ఓడించె ఇంతవరకును ఆదుకొనెనుగా - తన మహాత్మ్యము జూపె || భక్తు ||
6. ఈ భువియందు జీవించుకాలం - బ్రతికెదము ప్రభు కొరకే మనమాయన కర్పించుకొనెదము - ఆయన ఆశయమదియే || భక్తు ||
7. కొంచెము కాలమే మిగిలియున్నది - ప్రభువును సంధించుటకై గనుక మనము నడుచుకొనెదము - ప్రభు మార్గములయందు || భక్తు ||