#386Telugu Spiritual Song
Yesu prabhuni stutinchuta -Yentho yentho manchidi
యేసు ప్రభుని స్తుతించుట - యెంతో యెంతో మంచిది
ప|| యేసు ప్రభుని స్తుతించుట - యెంతో యెంతో మంచిది
1. మహోన్నతుడా - నీ నామమును - స్తుతించుటయే బహుమంచిది
హల్లెలూయ - హల్లెలూయ - హల్లెలూయ - హల్లెలూయ || హల్లె ||
2. విలువైన రక్తము - సిలువలో కార్చి - కలుషాత్ముల మమ్ము ప్రభు కడిగెను || హల్లె ||
3. ఎంతో గొప్ప - రక్షణ నిచ్చి - వింతైన జనముగా - మము జేసెను || హల్లె ||
4. మా శైలము - మా కేడెము - మా కోటయు మా ప్రభువే || హల్లె ||
5. ఉన్నత దుర్గము - రక్షణ శృంగము - రక్షించువాడు మన దేవుడే || హల్లె ||
6. అతి సుందరుడు - అందరిలోన - అతి కాంక్షణీయుడు అతి ప్రియుడు || హల్లె ||
7. రాత్రింబవళ్లు - వేనోళ్లతోను - స్తుతించుటయే బహు మంచిది || హల్లె ||
