#387Telugu Spiritual Song
Yesu prabhoo nee mukha darshanamuche
యేసు ప్రభు నీ ముఖ దర్శనముచే - నా ప్రతి యాశను తీర్చుకొందును
ప|| యేసు ప్రభు నీ ముఖ దర్శనముచే - నా ప్రతి యాశను తీర్చుకొందును
1. నీవే నాకు జీవాహారము - నిన్ను సమీపిచువారే మాత్రము
ఆకలి గొనరిల ఆదర్శుడవు || యేసు ||
2. నీ మందిర సమృద్ధి వలన - నా మది నెప్పుడు తృప్తిపొందితిని
ఆనంద జలమును త్రాగించుచున్నావు || యేసు ||
3. నీవే నాకు జీవపు మార్గము నీ సన్నిధిని
పూర్ణానందము - కలదని నిన్ను ఘనపరచెదను || యేసు ||
4. ఆశతో నిండిన నా ప్రాణమును - ఆకలిగొనిన నాదు ఆత్మను
మేలుతో నీవు తృప్తిపరచితివి || యేసు ||
5. నీ సంతోషము నా కొసగితివి - నా సంతోషము పరిపూర్ణముగా
కావలయునని కోరిన ప్రభువా || యేసు ||
6. నా జీవిత కాలమంతయును - నీ ఆలయములో నివసించుచు
హల్లెలూయ పాటను పాడెద ప్రభువా || యేసు ||
