18px
#388Telugu Spiritual Song

Jayamani paadu jayamani paadu Prabhu yesunake

జయమనిపాడు జయమనిపాడు ప్రభుయేసునకే

ప|| జయమనిపాడు జయమనిపాడు ప్రభుయేసునకే మహాదేవుండు విశ్వవిధాత రక్షకుడాయనే
1. ఆది అంతము అల్ఫా ఓమేగ ఆయనే ప్రభువు ఆయన యేగా రానున్నవాడు శక్తిమంతుడు || జయ ||
2. ప్రభు యేసునందు మమ్మును పిలచి ఏర్పరచుకొనెను ప్రేమతో మమ్ము పవిత్ర పరచి నిర్దోషులుగ తీర్చె || జయ ||
3. యేసులో మమ్ము రక్తము ద్వారా విమోచించితివి యెంతో కృపతో మమ్మును కడిగి మన్నించి నావుగా || జయ ||
4. యేసులో మాకు యేశిక్ష లేదు భయము బాసెగా వాసిగ మరణబలము తొలగించి పాపము బాపెగ || జయ ||
5. క్రీస్తులో మమ్ము నూతనపరచి తండ్రిని తెలిపెను కరుణించి మమ్ము అంగీకరించె ఎంతో అద్భుతము || జయ ||
6. మా స్వాస్థ్యమునకు సంచకరువుగా ఆత్మముద్ర నిచ్చెను మనోనేత్రములు వెలిగించి మాకు గొప్ప నిరీక్షణ నిచ్చె || జయ ||
7. ప్రభు క్రీస్తులో వాడబారని స్వాస్థ్యముగ నైతిమి పరిశుద్ధులలో మహిమైశ్వర్యంబు యెంతో గొప్పది || జయ ||