#389Telugu Spiritual Song
Entha jaali yesuvaa -Inthayani yoohincha lenu
ఎంత జాలి యేసువా - యింతయని యూహించలేను
ప|| ఎంత జాలి యేసువా - యింతయని యూహించలేను
1. హానికరుడ హింసకుడను - దేవదూషకుడను నేను
అవిశ్వాసినైన నన్ను - ఆదరించినావుగా || ఎంత ||
2. రక్షకుండా నాకు బదులు - శిక్ష ననుభవించినావు
సిలువయందు సొమ్మసిల్లి - చావొందితివి నాకై || ఎంత ||
3. ఏమి నీ కర్పించగలను - ఏమీ లేని వాడనయ్యా
రక్షణంపు పాత్రనెత్తి - స్తోత్రమంచు పాడెద || ఎంత ||
4. నీదు నామమునకు యిలలో - భయపడెడు వారి కొరకై
నాథుడా నీ విచ్చు మేలు - ఎంత గొప్పదేసువా || ఎంత ||
5. నేను బ్రతుకు దినములన్ని - క్షేమ మెల్ల వేళలందు
నిశ్చయముగ నీవు నాకు - ఇచ్చు వాడా ప్రభువా || ఎంత ||
6. నాదు ప్రాణమునకు ప్రభువా - సేద దీర్చువాడ వీవు
నాదు కాపరివి నీవు - నాకు లేమి లేదుగా || ఎంత ||
7. అందరిలో అతి శ్రేష్ఠుండా - అద్వితీయుడగు యేసయ్యా
హల్లెలూయ స్తోత్రములను - హర్షముతో పాడెద || ఎంత ||
