18px
#390Telugu Spiritual Song

Siyonu raaju vachchunu madin siddapadu

సీయోనురాజు వచ్చును మదిన్ సిద్ధపడు

ప|| సీయోనురాజు వచ్చును మదిన్ సిద్ధపడు మీ తనువుల్ శుద్ధిచేయుడి మీ రాజుకొఱకే
1. లోకస్తులు ప్రశ్నింతురు మరి మీ రాజు యెవరని తన శక్తిని విన్నవారు చూడ నాశింతురుగా క్రీస్తే మన రారాజని ఉత్సహించెదము || మీ ||
2. వాహనములు ఎన్నియున్న గార్దభమును యెక్కెను తా నెవరియింట నుండునో వారిని యుద్ధరించును పరీక్షించ ఆయనను చేర్చుకో నీయందు || మీ ||
3. యేసుని స్వీకరించెడు వారేగుదు రాయనతో తృణీకరించువారలు నశింతురు నిక్కంబుగ ప్రాముఖ్యమౌ ప్రశ్నయిది యోచించి చూచుకో || మీ ||
4. రాజుల రాజు ఆయనే ప్రభుల ప్రభువాయనే న్యాయవంతుడు ఆయనే మహాత్ముడైన దేవుడు సదా రాజ్యంబాయనదే ఆనంద మొందుడి || మీ ||