#391Telugu Spiritual Song
Boora shabhdambu ningin dwanimpa
బూర శబ్దంబు నింగిన్ ధ్వనింప - గాంచెదమేసున్ మా ఎదుట
1. బూర శబ్దంబు నింగిన్ ధ్వనింప - గాంచెదమేసున్ మా ఎదుట
ఓర్పుతో మేము వేచియుంటిమి నిద్రించే వారు నిలతురిలన్ || ప్రాణ ||
ప|| ప్రాణప్రియుడా - ప్రాణప్రియుడా - రమ్ము మా యేసు - పాడెదము - హల్లెలూయ -
ఎంతో సంతోషం ఎగిరి పోయెదం - పాటలతో
2. భక్తులకై వచ్చు తస్కరివలె - శుద్ధులు మాత్రమే మారెదరు
దూతలు నింగిన్ ఏకమైకూడి - పాటతో బూర ధ్వనింతురు || ప్రాణ ||
3. వేకువ చుక్క కాంతినిబోలి - సౌందర్యమైన మాధుర్యుడు
పరలోకమందు హెచ్చయినవాడు - నా కొరకై శ్రమ సహించెను || ప్రాణ ||
4. రెప్పపాటుతో శుద్ధులు లేచి - మరుగై పోదు రాయనతో నుండన్
మధుర గుంపు మేఘము చేరి - సంధించెద మే - సునచ్చట || ప్రాణ ||
5. పరమందు శుద్ధుల్ మకుటముల్ బొంద - దూతలు కాచి నిల్చుదినం
సంఘ వధువు ధవళ వస్ర్తంబు - ధరించి ఘనతనొందే దినం || ప్రాణ ||
6. హల్లెలూయా ఆనందించెదం - హల్లెలూయా ఆర్భటింతుం
హల్లెలూయా - ధన్యులైతిమి - హల్లెలూయా - ఆమెన్ ఆమెన్ || ప్రాణ ||
