#392Telugu Spiritual Song
Kontha samayame migilinadi - Kristesu prabhuvu thirigi vachun
కొంత సమయమే మిగిలినది - క్రీస్తేసు ప్రభువు
ప|| కొంత సమయమే మిగిలినది - క్రీస్తేసు ప్రభువు
తిరిగి వచ్చున్ - లేశమైనను జాగు చేయడు
1. ప్రభు వచ్చు వరకు కనిపెట్టుము - నిశ్చయముగా ఆయన వచ్చును
ప్రభురాక నెవరు ప్రేమింతురో - వారిని ప్రభువు కొనిపోవును || కొంత ||
2. ఆయన రాకడ సమీపము - సహవాసములో నిలిచియుండి
ప్రభు వాక్యమునకు లోబడియు - ఆయన కొరకై కనిపెట్టెదం || కొంత ||
3. అడుగంటుచున్నది ఆత్మీయత - అందరి ప్రేమలు చల్లారెగా
కన్నులు తెరచి మేల్కొనుడి - విడువబడిన మీగతి యేమగున్ || కొంత ||
4. తమ స్వంత పనులలో విశ్వాసులు - కొందరు నిద్రించు చున్నారుగా
మేల్కొను వారెత్తబడెదరు - విడువ బడిన వారిగతి యేమగున్ || కొంత ||
5. నోవహు కాలమున్ స్మరియింతము - సమస్తమును దిద్దుకొని
విడుదల దిన మాసన్నమాయె - విమోచనా విశ్రాంతి నిచ్చు || కొంత ||
