18px
#394Telugu Spiritual Song

Caluvarilo vimukhti – kaligeno priyundaa

కలువరిలో విముక్తి - కలిగినో ప్రియుండా

ప|| కలువరిలో విముక్తి - కలిగినో ప్రియుండా
1. పాపమెరుగని యేసు - పాపముగ జేయబడి శాపంబు వహించి - శ్రమల సహించెను || కలువరి ||
2. పాదహస్తముల నుండి - ప్రక్క గాయము నుండి ప్రవహించెను పుణ్య - ప్రణయామృత ధార || కలువరి ||
3. ప్రభు యేసుని రక్తమే - ప్రేమామృత ధార ప్రియమారగ త్రాగు - ప్రభు సన్నిధి జేరి || కలువరి ||
4. ఘన ప్రేమను జూపి - తన రక్తముచేత తానే కడుగును - మన పాపము నంత || కలువరి ||
5. సర్వజనులకు - సువార్త నందించి సరియైనట్టి దారి - జూపింతుము వేగ || కలువరి ||
6. ప్రాపంచసాగరాన - ప్రభువా నేను దుమికి పాపులను రక్షించు - ప్రాదేహత నిమ్ము || కలువరి ||